మళ్లీ పాయల్ కే ఛాన్స్ ఇచ్చిన 'RX 100' డైరెక్టర్!
- అజయ్ భూపతి దర్శకత్వంలో 'మంగళవారం'
- గ్రామీణ నేపథ్యంలో .. హారర్ జోనర్లో నడిచే కథ
- ఆల్రెడీ షూటింగు మొదలెట్టేసిన డైరెక్టర్
- వేసవిలో విడుదల చేసే ఆలోచన
పాయల్ మంచి పొడగరి .. ఆకర్షణీయమైన రూపం ఆమె సొంతం. అందువలన ఆమె హవా కొనసాగడం ఖాయమని అంతా అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఆమెకి వరుసగా అవకాశాలైతే వచ్చాయిగానీ, వాటితో పాటు సక్సెస్ లు రాలేదు. అయినా ఆమె ప్రయత్నాలు ఆమె చేస్తూనే వస్తోంది. ఇక ఈ సినిమాను తెరకెక్కించిన అజయ్ భూపతి, ఆ తరువాత 'మహాసముద్రం' చేయగా, ఆది పరాజయం పాలైంది.
దాంతో కొంత గ్యాప్ తీసుకున్న ఆయన, నాయిక ప్రధానమైన కథను రెడీ చేసుకున్నాడు. ఈ కథకి 'మంగళవారం' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నాడు. హారర్ జోనర్లో .. విలేజ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఆల్రెడీ షూటింగు మొదలెట్టేసిన ఆయన, వేసవిలో ఈ సినిమాను విడుదల చేయనున్నాడు. ఈ సినిమాతోనైనా ఈ ఇద్దరికీ హిట్ పడుతుందేమో చూడాలి.