అల్లరి నరేశ్ కొత్త అవతారమే 'ఉగ్రం' .. టీజర్ రిలీజ్!
- అల్లరి నరేశ్ హీరోగా రూపొందిన 'ఉగ్రం'
- 'నాంది' దర్శకుడి మరో ప్రయత్నం ఇది
- పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్న హీరో
- కథానాయికగా 'మిర్నా' పరిచయం
అందువలన ఈ మధ్య కాలంలో ప్రయోగాత్మక కథలను .. పాత్రలను చేయడానికే ఆయన ఎక్కువగా మొగ్గుచూపుతున్నాడు. అలా విజయ్ కనకమేడల దర్శకత్వంలో చేసిన 'నాంది' హిట్ కావడంతో, మళ్లీ ఆ దర్శకుడితోనే 'ఉగ్రం' సినిమా చేశాడు. ఈ సినిమాతో 'మిర్నా' తెలుగు తెరకి కథానాయికగా పరిచయమవుతోంది.
తాజాగా ఈ సినిమా నుంచి నాగచైతన్య చేతుల మీదుగా టీజర్ ను రిలీజ్ చేయించారు. నరేశ్ ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడనే విషయం టీజర్ వలన తెలుస్తోంది. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా కట్ చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందించిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.