బెయిలుపై బయటకు వచ్చిన వెంటనే క్రికెటర్ పృథ్వీషాపై కేసు పెట్టిన సప్నా గిల్
- హోటల్‌లో సెల్ఫీ విషయంలో షా-సప్నా గిల్ మధ్య వివాదం
- షా స్నేహితుడు ఆశిష్ కారుపై సప్నా స్నేహితుల దాడి
- పృథ్వీ షానే తమను తొలుత రెచ్చగొట్టాడన్న సప్నా గిల్
పృథ్వీషా స్నేహితుడి కారును ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించిన కేసులో సప్నా గిల్ సహా ఎనిమిది మందిపై ఒషివారా పోలీసులు కేసు నమోదు చేశారు. ముంబైలోని ఓ హోటల్‌లో పృథ్వీ భోజనం చేస్తున్న సమయంలో సెల్ఫీ తీసుకునే విషయంలో సప్నా, పృథ్వీ మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలో జరిగిన గొడవలో ఆశిష్ కారుపై సప్నాగిల్, ఆమె స్నేహితులు దాడి చేసినట్టు ఆరోపణలున్నాయి. అయితే, పృథ్వీ షానే తమను తొలుత రెచ్చగొట్టినట్టు సప్నా ఆరోపిస్తున్నారు.