మారని టీడీపీ సానుభూతిపరులైన వాలంటీర్లను తొలగిస్తాం: వసంత కృష్ణప్రసాద్
- టీడీపీ సానుభూతిపరులకు కూడా వాలంటీర్లుగా అవకాశం కల్పించామన్న కృష్ణప్రసాద్
- వాళ్లు మారతారులే అనుకున్నామని వ్యాఖ్య
- కొందరు వాలంటీర్లు మారలేదన్న వైసీపీ ఎమ్మెల్యే
ఈ వ్యవస్థ పూర్తిగా మన చేతుల్లోనే ఉందని ఆయన అన్నారు. అలాగని చెప్పి అకారణంగా ప్రతి వాలంటీర్ ను మారుస్తామంటే కుదరదని, మార్చే ప్రతి వాలంటీర్ తో తాను వ్యక్తిగతంగా మాట్లాడతానని తెలిపారు. గృహ సారథులు, వాలంటీర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కృష్ణప్రసాద్ వ్యాఖ్యలను విపక్షాలు తప్పుపడుతున్నాయి. ప్రభుత్వ జీతంతో పనిచేసే వాలంటీర్లను వైసీపీ కార్యకర్తల మాదిరి చూస్తున్నారని మండిపడుతున్నారు.