ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు.. చంద్రబాబు పర్యటనపై ఉండవల్లి కామెంట్
- చంద్రబాబు పర్యటనకు అడ్డంకులు సృష్టించడంపై మాజీ ఎంపీ ఉండవల్లి ఆశ్చర్యం
- ఇది చివరకు వైసీపీకే మైనస్‌గా మారుతుందని వ్యాఖ్య
- జగన్‌ను కాంగ్రెస్ జైల్లో పెట్టాక సీఎం అయ్యారని గుర్తు చేసిన ఉండవల్లి
తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటనకు అనుమతుల అంశం ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే. ముందురోజునే సభకు అనుమతిచ్చి.. ఆ తరువాత వెంటనే అనుమతి లేదంటూ అరాచకం సృష్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. సభను అడ్డుకోవడమే లక్ష్యంగా పోలీసులు చిత్ర విచిత్ర వ్యూహాలు పన్నారన్నారు. నిరసనకారుల తరహాలో ఖాకీ దుస్తులతో పోలీసులే రోడ్డుపై బైఠాయించడం ఏంటని నిప్పులు చెరిగారు. ఇకపై పోలీసులకు సహకరించబోమని..సహాయ నిరాకరణ ప్రకటిస్తున్నామని పేర్కొన్నారు.