అప్పటికప్పుడు కొరమేను చేపలు పట్టుకొచ్చి రేవంత్ రెడ్డి కోసం వండిన ముదిరాజ్ యువకుడు
- హాత్ సే హాత్ జోడో యాత్ర చేస్తున్న రేవంత్
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాదయాత్ర
- చేపల కూరతో భోజనం పంపిన కిరణ్ ముదిరాజ్ కుటుంబం
- ఈ ప్రేమ ముందు ఏ కష్టమైనా బలాదూర్ అంటూ రేవంత్ ట్వీట్
పాదయాత్ర చేస్తున్న రేవంత్ రెడ్డి... కిరణ్ ముదిరాజ్ అనే యువకుడి ఇంటికి వచ్చారు. రేవంత్ రాక నేపథ్యంలో కిరణ్ చెరువులోంచి కొరమేను చేపలను పట్టుకొచ్చారు. ఆ తాజా చేపలతో రుచికరమైన పులుసుతో పాటు, ఫ్రై చేసి రేవంత్ కు పసందైన భోజనం అందించారు.
దీనిపై రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. ఈ ప్రేమ ముందు ఏ కష్టమైనా బలాదూర్ అని పేర్కొన్నారు. పేదవాడు చూపే ప్రేమే నా పోరాటానికి ఆలంబన అని వెల్లడించారు. ముదిరాజ్ సోదరుడు అభిమానంతో వండి తెచ్చిన భోజనం ఈ యాత్రలో తనకు ఒక మధుర జ్ఞాపకంలా మిగిలిపోతుందని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో పంచుకున్నారు.