తమిళ సినిమాలతో బిజీ బిజీగా సునీల్!
- విభిన్నమైన పాత్రలను చేస్తున్న సునీల్
- తెలుగులో భారీ సినిమాలతో బిజీ
- తమిళంలోను స్టార్ హీరోలతో సినిమాలు
- బాలీవుడ్ నుంచి అవకాశాలు వస్తున్నాయన్న సునీల్
"నేను ఇప్పుడు ఫలానా పాత్రలను మాత్రమే చేయాలని అనుకోవడం లేదు. కొత్తదనం ఉన్న అన్ని రకాల పాత్రలు చేయాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం తెలుగులో శంకర్ - చరణ్ కాంబినేషన్లోని సినిమాలోను, 'పుష్ప 2'లోను .. 'విరూపాక్ష'లోను .. అలాగే కమిటైన సినిమాలు మరికొన్ని ఉన్నాయి" అన్నాడు.
ఇక తమిళంలో రజనీకాంత్ 'జైలర్' .. కార్తి 'జపాన్' .. శివకార్తికేయన్ సినిమాలోను .. విశాల్ సినిమాలోను చేస్తున్నాను. ఇంకా కొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన మాటలు నడుస్తున్నాయి. ఇక బాలీవుడ్ సినిమాల నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి" అంటూ చెప్పుకొచ్చాడు.