జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్... స్టేషన్ బెయిల్ పై విడుదల
- పెద్దపప్పూరు రీచ్ వద్ద జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన
- అక్రమ ఇసుక తవ్వకాలపై ఆగ్రహం
- జేసీని అదుపులోకి తీసుకున్న పోలీసులు
బెయిల్ ఇవ్వడానికి నోటీసుపై సంతకం చేయాలని పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డిని కోరారు. ఇసుక అక్రమ తవ్వకాలపై తన ఫిర్యాదుకు రసీదు ఇవ్వాలని జేసీ కోరారు. జేసీ ఫిర్యాదుపై రసీదు ఇచ్చేందుకు పోలీసులు నిరాకరించారు. అటు, పెద్దపప్పూరు పోలీస్ స్టేషన్ వద్దకు టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. జేసీ అరెస్ట్ కు నిరసనలు తెలిపాయి. అనంతరం, పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డిని స్టేషన్ బెయిల్ పై విడుదల చేశారు.