ఎడ్యుకేషన్ మీద వచ్చేంత డబ్బు పాలిటిక్స్ లో రాదు: 'సార్' ట్రైలర్ రిలీజ్!
- విద్యా వ్యవస్థలోని పరిస్థితులకు అద్దం పట్టే 'సార్'
- ధనుశ్ జోడీ కట్టిన సంయుక్త మీనన్
- ప్రతినాయకుడిగా కనిపిస్తున్న సముద్రఖని
- ఈ నెల 17వ తేదీన సినిమా విడుదల
కొంతసేపటి క్రితం తెలుగు వెర్షన్ కి సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం విద్యా వ్యవస్థలోని పరిస్థితులపైనా, అందుకు కారకులవుతున్న వారిపైనా ఒక లెక్చరర్ తిరుగుబాటే ఈ కథ. కొంతమందికి మాత్రమే ఉన్నత విద్య అందుబాటులో ఉండటం పట్ల అతను చూపించే ఆవేశమే ఈ సినిమా అని చెప్పుకోవచ్చు.
'ఎడ్యుకేషన్ లో వచ్చేంత డబ్బు పాలిటిక్స్ లో రాదు' .. 'డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు .. కానీ మర్యాద అనేది చదువు మాత్రమే సంపాదించిపెడుతుంది' అనే డైలాగ్స్ ట్రైలర్ లో హైలైట్ గా కనిపిస్తున్నాయి. సముద్రఖని .. 'ఆడుకాలం' నరేన్ .. సాయికుమార్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ నెల 17వ తేదీన విడుదల కానుంది.