ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డికి బాలినేని సవాల్
- వైసీపీలో ఉండటం ఇష్టం లేకపోతే వెళ్లిపోవచ్చన్న బాలినేని
- అది ఫోన్ ట్యాపింగ్ కాదు... ఫోన్ రికార్డింగ్ అని వ్యాఖ్య
- కోటంరెడ్డి స్నేహితుడిని మీడియా ముందుకు తెస్తామన్న బాలినేని
కోటంరెడ్డి విడుదల చేసిన ఆడియో ట్యాప్ చేసింది కాదని... అది రికార్డ్ చేసిందని అన్నారు. అది రికార్డ్ చేసిన ఆడియో అని నిరూపితమైతే కోటంరెడ్డి రాజకీయాలను వదిలేయాలని సవాల్ విసిరారు. వాస్తవాలను నిరూపించడానికి కోటంరెడ్డి స్నేహితుడిని మీడియా ముందుకు తీసుకొస్తామని చెప్పారు. మరోవైపు తనకు, తన స్నేహితుడికి మధ్య ఫోన్ కాల్ ట్యాప్ అయిన ఆడియోను ఈరోజు కోటంరెడ్డి మీడియా ముఖంగా విడుదల చేశారు. తామిద్దరం ఐఫోన్ వాడుతున్నామని, ఐఫోన్ లో రికార్డింగ్ సదుపాయం ఉండదని... అలాంటప్పుడు ఈ ఆడియో ఎలా వస్తుందని కోటంరెడ్డి ప్రశ్నించిన సంగతి తెలిసిందే.