ఆసక్తిని పెంచుతున్న 'మైఖేల్' యాక్షన్ పార్టు మేకింగ్ వీడియో!
- యాక్షన్ నేపథ్యంలో సాగే 'మైఖేల్'
- కీలకమైన పాత్రలో విజయ్ సేతుపతి
- వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర హైలైట్ అనే టాక్
- ఈ నెల 3వ తేదీన సినిమా రిలీజ్
నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించారు. తాజాగా ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కి సంబంధించిన మేకింగ్ వీడియోను వదిలారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి .. వరలక్ష్మి శరత్ కుమార్ .. అనసూయ .. గౌతమ్ మీనన్ ముఖ్యమైన పాత్రలను పోషించారు.
ప్రధానమైన పాత్రల నేపథ్యంలో వచ్చే యాక్షన్ సీన్స్ కి సంబంధించిన మేకింగ్ వీడియో ఆకట్టుకుంటోంది. ఫైట్స్ లో సందీప్ నిజంగానే గాయపడటం కూడా ఈ వీడియోలో చూపించారు. యాక్షన్ కి పెద్దపీట వేసిన ఈ సినిమా, ఎలాంటి రిజల్టును రాబడుతుందనేది చూడాలి.