'అమిగోస్' నుంచి బాలయ్య హిట్ సాంగ్ రీమిక్స్!
- డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన 'అమిగోస్'
- ఆషిక రంగనాథ్ కి తెలుగులో ఇది ఫస్టు మూవీ
- విభిన్నమైన లుక్స్ తో కనిపించనున్న కల్యాణ్ రామ్
- గిబ్రాన్ సంగీతం.. ఫిబ్రవరి 10న సినిమా విడుదల
తాజాగా ఈ సినిమా నుంచి 'ఎన్నో రాత్రులొస్తాయిగానీ రాదే వెన్నెలమ్మా' అనే వీడియో సాంగును రిలీజ్ చేశారు. గతంలో బాలకృష్ణ చేసిన 'ధర్మక్షేత్రం' సినిమాలోనిది ఈ పాట. ఇళయరాజా స్వరకల్పనలో బాలు - చిత్ర ఆలపించిన ఆ పాట, రొమాంటిక్ సాంగ్స్ లో ముందువరుసలో కనిపిస్తుంది.
అలాంటి ఆ పాటను ఈ సినిమా కోసం కల్యాణ్ రామ్ రీమిక్స్ చేయించాడు. ఎస్పీ చరణ్ - సమీరా భరద్వాజ్ ఈ పాటను ఆలపించారు. కల్యాణ్ రామ్ - ఆషిక రంగనాథ్ పై ఈ పాటను అందంగా చిత్రీకరించారు. గిబ్రాన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, ఫిబ్రవరి 10వ తేదీన విడుదల చేయనున్నారు.