విజయ్–సమంత ఖుషి సినిమా ఆగిపోలేదు.. అప్డేట్ ఇచ్చిన దర్శకుడు శివ నిర్వాణ
- ఇప్పటికే కొంత షూటింగ్ చేసిన చిత్రబృందం
- వివిధ కారణాలతో చిత్రీకరణ ఆగిపోయిన వైనం
- త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని శివ ప్రకటన
ఇలా షూటింగ్ షెడ్యూల్స్ నిలిచిపోవడంతో ఈ సినిమా ఆగిపోయిందన్న పుకార్లు మొదలయ్యాయి. ఆ పుకార్లకు దర్శకుడు పుల్ స్టాప్ పెట్టాడు. చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలవుతుందని ట్వీట్ చేశాడు. అంతా అందంగా ఉండబోతోంది అని పేర్కొన్నాడు. తదుపరి షెడ్యూల్ ను హైదరాబాద్‌తో పాటు కేరళలో చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియన్ స్థాయిలో దక్షిణాది భాషలతో పాటు హిందీలో ఖుషి సినిమాను రిలీజ్ చేయాలని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్లాన్ చేస్తోంది.