మెగాస్టార్ రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేను: డైరెక్టర్ బాబీ
- 'వాల్తేరు వీరయ్య' సక్సెస్ సెలబ్రేషన్స్ లో బాబీ
- తన తండ్రి విషయంలో మెగాస్టార్ కి కృతజ్ఞతలు
- బ్లాక్ బస్టర్ హిట్ కొడతామని ముందుగానే చెప్పారని వ్యాఖ్య
- అభిమానుల కోసమే మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు వస్తున్నారని వెల్లడి
ఈ స్టేజ్ పై బాబీ మాట్లాడుతూ .. " చిరంజీవిగారికి మా ఫాదర్ వీరాభిమాని. మా నాన్న 4 నెలల్లో చనిపోతారని తెలిసి, ఆయనని చిరంజీవిగారు పిలిపించారు. అప్పటికి ఈ సినిమా 30 శాతం షూటింగు మాత్రమే పూర్తయింది. అయినా నేను బ్లాక్ బస్టర్ హిట్ కొడతానని మా నాన్నతో చిరంజీవిగారు చెప్పారు. ఆ సంతృప్తితోనే మా ఫాదర్ కాలం చేశారు. అందుకు మెగాస్టార్ కి కృతజ్ఞతలు చెబుతున్నాను" అన్నారు.
" మెగాస్టార్ నిద్రలేస్తే సినిమాను గురించి .. అభిమానుల గురించి ఆలోచన చేస్తారు. అందువల్లనే ఆ కుటుంబం నుంచి పవర్ స్టార్ వచ్చారు .. రామ్ చరణ్ వచ్చారు. చిరంజీవిగారు నా చేతిపై ముద్దుపెట్టారు. నేను ఎక్కడికి వెళ్లినా అందరూ ఆ చేయిని తాకుతున్నారు. కొన్ని వందల మంది ఆ చేయిని ముద్దు పెట్టుకున్నారు" అని అనగానే చిరంజీవి నవ్వేశారు.