మేమందరం ఓ గ్యాంగ్ .. మా లీడర్ మెగాస్టార్: 'వాల్తేరు వీరయ్య' సక్సెస్ ఈవెంటులో కోన వెంకట్
- హనుమకొండలో 'వాల్తేరు వీరయ్య' సక్సెస్ ఈవెంట్
- వేలాదిగా తరలివచ్చిన అభిమానులు
- 250 కోట్లకి దగ్గరలో వసూళ్లు ఉన్నాయన్న కోన వెంకట్
- ఈ విజయానికి కారకులు మెగాస్టార్ అని వెల్లడి
"నాకు తెలిసి ఈ సినిమా 250 కోట్ల వసూళ్లకు దగ్గరలో ఉంది. ఈ సినిమా ఇంత మెగా సక్సెస్ కావడానికి కారణం, చిరంజీవి గారిపై బాబీకి ఉన్న అభిమానం .. ఈ ఇద్దరిపై రవితేజకి ఉన్న ప్రేమ. ఇక ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబట్టడానికి కారణం చిరంజీవిగారే. ఈ సినిమా కోసం పనిచేసిన మేమంతా గ్యాంగ్ అయితే .. మా గ్యాంగ్ కి లీడరే మెగాస్టార్" అని చెప్పారు.
" ఈ సినిమా తరువాత బాబీ పేరు టాప్ త్రీ డైరెక్టర్స్ లో ఉంటుంది అని చిరంజీవిగారు చెప్పారు. నాకు తెలిసి బాబీ టాప్ త్రీ ప్లేస్ లోకి వెళ్లిపోయాడు. ఈ రోజున ఈ సినిమా ఇంతటి సక్సెస్ ను సాధించడానికి కారణం ప్రేక్షకులు. అలాంటి ప్రేక్షకులందరికీ ఈ విజయం అంకితం" అంటూ ముగించారు.
.