అలా చేస్తే జంధ్యాలకి చాలా కోపం వచ్చేదట!
- హాస్యకథా చిత్రాల దర్శకుడిగా జంధ్యాలకి పేరు
- ఫోన్లోనే అప్పటికప్పుడు డైలాగ్స్ చెప్పేవారన్న అర్థాంగి అన్నపూర్ణ
- తాను రాసిన సన్నివేశాలు సరిగ్గా తీయకపోయినా ఆయనకి కోపం వచ్చేదని వెల్లడి
- అందుకే ఆయన డైరెక్టర్ గా మారారని వెల్లడి
"జంధ్యాలగారు పుస్తకాలు ఎక్కువగా చదివేవారు. దర్శకులు వేరే లొకేషన్స్ నుంచి కాల్ చేస్తే, ఫోన్ లోనే డైలాగ్స్ చెప్పేసేవారు. స్క్రీన్ ప్లే ఒకసారి చెబితే ఆయనకి గుర్తుండిపోయేది. ఈ విషయంలో ఆయనను అందరూ మెచ్చుకునేవారు. జంధ్యాలకి ఒక సినిమాను అప్పగిస్తే ఇక ధైర్యంగా ఉండొచ్చని ఏడిద నాగేశ్వరరావుగారు అనేవారు.
" ఇక తాను రాసిన సన్నివేశాలు సరిగ్గా తీయకపోయినా .. డైరెక్టర్లు మార్చుకున్నది నచ్చకపోయినా ఆయనకి కోపం వచ్చేది. ఆ తరువాత సినిమాకి రాయమని అడిగితే రాసేవారు కాదు. ఇక ఆ తరువాత .. తాను రాసుకున్నది తాను తీసుకుంటేనే కరెక్టుగా ఉంటుందని ఆయన భావించారు. అప్పటి నుంచి తాను డైరెక్టర్ గా మారిపోయారు" అంటూ చెప్పుకొచ్చారు.