వీరయ్య విజయ విహారం .. ఈవెంట్ ఎక్కడంటే ..!
- 200 కోట్ల క్లబ్ లోకి చేరిన 'వాల్తేరు వీరయ్య'
- రేపు హనుమకొండలో సక్సెస్ సెలబ్రేషన్స్
- సాయంత్రం 6 గంటల నుంచి వేడుక మొదలు
- ఈవెంటులో చరణ్ కూడా సందడి చేయనున్నట్టు సమాచారం
ఈ నేపథ్యంలో ఈ సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ ను గ్రాండ్ గా ప్లాన్ చేసింది. 'వీరయ్య విజయ విహారం' పేరుతో ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ ను రేపు హనుమకొండలో నిర్వహిస్తున్నారు. యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఆ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక జరగనుంది.
ఈ సినిమాలో శ్రుతి హాసన్ కథానాయికగా నటించగా .. ప్రతినాయకుడిగా ప్రకాశ్ రాజ్ కనిపించాడు. ఒక కీలకమైన పాత్రను రవితేజ పోషించాడు. రేపు జరగనున్న ఈ వేడుకలో చరణ్ కూడా పాల్గొంటూ ఉండటం విశేషం. మొత్తానికి రేపు హనుమకొండలో మెగా సందడి కనిపించనుందన్న మాట.