శర్వానంద్ నిశ్చితార్ధానికి జంటగా వచ్చిన సిద్ధార్థ్, అదితీరావు పెళ్లిపై చర్చ
- సిద్ధార్థ్, అదితీరావు ప్రేమలో ఉన్నారంటూ కొన్నాళ్లుగా వార్తలు
- నిన్న హైదరాబాద్ లో రక్షిత రెడ్డితో శర్వా ఎంగేజ్ మెంట్
- హాజరైన పలువురు ప్రముఖులు
'మహా సముద్రం' సినిమాలో ఈ ఇద్దరూ శర్వాతో కలిసి నటించారు. ఆ సమయంలో ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని పలువురు చెబుతున్నారు. గతేడాది అదితీరావు పుట్టిన రోజు సందర్భంగా సిద్ధార్థ్ 'ప్రిన్సెస్ ఆఫ్ హార్ట్' అంటూ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలపాడు. ఈ మధ్య అన్ స్టాపబుల్ షోలో వీరి ప్రేమ గురించి బాలకృష్ణ.. శర్వాను అడిగారు. ఇప్పుడు శర్వా ఎంగేజ్ మెంట్ కు కలిసి వచ్చిన సిద్ధార్థ్, అదితి జంట బాగుందని ఫ్యాన్స్ అంటున్నారు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.