ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ కి చేరిన సానియా మీర్జా, రోహన్ జోడీ
- సెమీస్ లో డిసిరే క్రావ్జిక్, నీల్ స్కుప్స్కి జోడిపై విజయం
- రోహన్ తో కలిసి చివరి గ్రాండ్ స్లామ్ ఆడుతుండటం బాగుందన్న సానియా
- ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉందని వ్యాఖ్య
మ్యాచ్ విజయానంతరం సానియా మాట్లాడుతూ.. ఇదొక అద్భుతమైన మ్యాచ్ అని తెలిపింది. రోహన్ తో కలిసి తన చివరి గ్రాండ్ స్లామ్ టైటిల్ పోరులో ఆడటం చాలా బాగుందని చెప్పింది. తనకు 14 ఏళ్లు ఉన్నప్పుడు తన మిక్స్ డ్ డబుల్స్ పార్ట్ నర్ రోహన్ అని... ఇప్పుడు తనకు 36, ఆయనకు 42 ఏళ్ల వయసని... ఇప్పుడు కూడా ఇద్దరం కలిసి ఆడుతున్నామని తెలిపింది. టెన్నిస్ ప్లేయర్లుగా తమ మధ్య మంచి బంధం ఉందని చెప్పింది. ఇండియా నుంచి వచ్చి ఆస్ట్రేలియాలో స్థిరపడిన ఎంతో మంది తమకు మద్దతుగా నిలిచారని తెలిపింది.