'అక్కినేని.. తొక్కినేని' అన్న బాలకృష్ణ వ్యాఖ్యలకు అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ కౌంటర్
- 'వీరసింహారెడ్డి' సక్సెస్ మీట్ లో బాలయ్య తీవ్ర వ్యాఖ్యలు
- ఎన్టీఆర్, ఏఎన్నార్ తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలన్న అక్కినేని వారసులు
- వారిని అగౌరవపరచడం మనల్ని మనమే కించపరుచుకోవడం అని వ్యాఖ్య
ఈ నేపథ్యంలో అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ స్పందించారు. 'నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్వీ రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు. వారిని అగౌరవపరచడం మనల్ని మనమే కించపరుచుకోవడం...' అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై బాలయ్య అభిమానులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
