కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ నోటీసులు
- వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు
- పులివెందుల వచ్చిన సీబీఐ అధికారులు
- అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి కోసం ఆరా
- అవినాశ్ పీఏకు నోటీసుల అందజేత
- లేఖ ద్వారా బదులిచ్చిన అవినాశ్
నోటీసులపై అవినాశ్ రెడ్డి వెంటనే స్పందించారు. సీబీఐ విచారణకు అన్ని విధాలా సహకరిస్తానని వెల్లడించారు. అయితే, పులివెందులలో బిజీ షెడ్యూల్ ఉన్నందున రేపు విచారణకు రాలేనని తెలియజేశారు. విచారణకు మరో తేదీ తెలియజేయాలని కోరారు. ఈ మేరకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.
కాగా, పులివెందులలో సీబీఐ అధికారులు అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి కోసం ఆరా తీయడం తెలిసిందే.