ఓ ఇంటివారైన కేఎల్ రాహుల్, అతియా శెట్టి
- కేఎల్ రాహుల్ వెడ్స్ అతియా శెట్టి
- ముంబయిలో వివాహం
- ఖండాలాలోని సునీల్ శెట్టి ఫాంహౌస్ లో పెళ్లి వేడుక
- కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో పరిణయం
కాగా, టీమిండియా క్రికెటర్లు ప్రస్తుతం న్యూజిలాండ్ తో మూడో వన్డేకు సిద్ధమవుతుండడంతో జట్టులోని వారెవరూ ఈ పెళ్లికి రాలేదు.
ఇషాంత్ శర్మ, వరుణ్ ఆరోన్ వంటి క్రికెటర్లు హాజరయ్యారు. బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్ తదితరులు విచ్చేశారు. రాహుల్, అతియా పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.
కేఎల్ రాహుల్, అతియా శెట్టి చాలాకాలంగా ప్రేమలో ఉన్నారు. సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టడం, ఒకరి పోస్టులపై మరొకరు కామెంట్లు చేయడం ద్వారా వీరు తమ బంధాన్ని ఎప్పటికప్పుడు వెల్లడిస్తూ, అందరి దృష్టిలో పడ్డారు.


