'శాకుంతలం' నుంచి సెకండ్ సింగిల్ రెడీ!
- సమంత ప్రధానమైన పాత్రను పోషించిన 'శాకుంతలం'
- సంగీతాన్ని సమకూర్చిన మణిశర్మ
- ఫస్టు సింగిల్ కి అనూహ్యమైన రెస్పాన్స్
- ఈ నెల 25న సెకండ్ సింగిల్ రిలీజ్
- వచ్చేనెల 17వ తేదీన సినిమా రిలీజ్
ఈ నేపథ్యంలో సెకండ్ సింగిల్ ను కూడా ఐదు భాషల్లో రిలీజ్ చేయడానికి ఈ సినిమా టీమ్ డేట్ ఫిక్స్ చేసింది. ఈ నెల 25వ తేదీన ఈ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. 'రుషి వనములోన .. ' అంటూ ఈ పాట మొదలుకానుంది. కణ్వ మహర్షి ఆశ్రమ నేపథ్యంలో ఈ పాటను చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. మణిశర్మ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు.
సమంత తన కెరియర్లోనే ఈ సినిమా ప్రత్యేకమైన స్థానంలో నిలుస్తుందని భావిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తన క్రేజ్ ను పెంచనున్న ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నట్టుగా ఆమె చెప్పింది. ఇక మోహన్ బాబు .. ప్రకాశ్ రాజ్ .. గౌతమి ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను , వచ్చేనెల 17వ తేదీన విడుదల చేయనున్నారు.