Kannada: కన్నడ నటుడు, దర్శకుడు నవీన్ కృష్ణ సోదరి అదృశ్యం

Kannada actor director Naveen Krishna sister missing

  • ఈ నెల 17న ఇంటి నుంచి బయల్దేరిన నీతా పవార్
  • అప్పటి నుంచి ఇంత వరకు తిరిగి రాని వైనం
  • మిస్సింగ్ కేసు నమోదు చేసి, గాలిస్తున్న పోలీసులు

కన్నడ సినీ నటుడు, దర్శకుడు నవీన్ కృష్ణ సోదరి నీతా పవార్ అదృశ్యమయింది. ఈ నెల 17న ఆమె ఇంటి నుంచి బయల్దేరింది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఇంటికి రాలేదు. ఈ విషయాన్ని నవీన్ కృష్ణ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన సోదరి నీతా ఫొటోను షేర్ చేసి, ఆమెకు సంబంధించిన సమాచారాన్ని పంచుకున్నారు. ఆమె ఆచూకీ తెలిస్తే తమకు సమాచారాన్ని ఇవ్వాలంటూ ఫోన్ నెంబర్లను ఇచ్చారు. 

ఆయన తెలిపిన వివరాల ప్రకారం... నీతా పవార్ బెంగళూరులోని సుబ్రహ్మణ్యపుర పరిధిలో నివాసం ఉంటోంది. ఆమె ఇంటికి రాకపోవడంతో నవీన్ కృష్ణ వెతకడం ప్రారంభించారు. ఆమెకు తెలిసిన బంధుమిత్రులను కూడా సంప్రదించాడు. అయినా ఆమె ఆచూకీ దొరకలేదు. మరోవైపు ఆమె ఫోన్ కూడా స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో, పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. ఆమె స్వయంగా ఇంటి నుంచి వెళ్లిపోయిందా, లేక మార్గమధ్యంలో ఎవరైనా అపహరించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చివరిసారిగా ఆమె ఫోన్ సిగ్నల్ ఎక్కడ కట్ అయిందనే వివరాలను సేకరిస్తున్నారు.

  • Loading...

More Telugu News