ఆసక్తిని రేకెత్తించే కాన్సెప్టుతో 'అథర్వ' .. స్పెషల్ పోస్టర్ రిలీజ్!
- విభిన్నమైన కథాంశంతో రూపొందిన 'అథర్వ'
- హీరోగా డిఫరెంట్ లుక్ తో కనిపించనున్న కార్తీక్ రాజు
- ముగింపు దశకి చేరుకున్న పోస్టు ప్రొడక్షన్ పనులు
- త్వరలో నాలుగు భాషల్లో విడుదల
ఈ 'అథర్వ' సినిమాను మహేష్ రెడ్డి తెరకెక్కిస్తుండగా.. సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సిమ్రన్ చౌదరి .. ఐరా .. హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అన్ని అప్ డేట్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి కార్తిక్ రాజు .. సిమ్రన్ చౌదరి .. ఐరా పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్‌లను విడుదల చేశారు.
ఈ పోస్టర్ తో పాటు మోషన్ పోస్టర్ .. గ్లింప్స్ కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభించింది. దీంతో సినిమాకి మంచి బజ్ ఏర్పడింది. ఇప్పుడు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరిదశలో ఉన్నాయి. త్వరలోనే టీజర్ .. ట్రైలర్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లోను ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.