చంద్రబాబు ప్రశంసకు జూనియర్ ఎన్టీఆర్ స్పందన
- గోల్డెన్ గ్లోబ్స్ అవార్డును కైవసం చేసుకున్న 'నాటునాటు' సాంగ్
- 'ఆర్ఆర్ఆర్' టీమ్ పై ప్రశంసలు కురిపించిన చంద్రబాబు
- థాంక్యూ మామయ్య అంటూ ప్రతిస్పందించిన తారక్
గోల్డెన్ గ్లోబ్స్ అవార్డును 'ఆర్ఆర్ఆర్' చిత్రం సాధించడం సంతోషంగా ఉందని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఎంఎం కీరవాణి, ఎస్ఎస్ రాజమౌళి, యావత్ టీమ్ సభ్యులకు శుభాకాంక్షలను తెలియజేశారు. తాను గతంలో చెప్పిన విధంగానే తెలుగు ఇప్పుడు ఇండియన్ సాఫ్ట్ పవర్ గా మారిందని చెప్పారు. చంద్రబాబు ప్రశంసలపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించాడు. 'థాంక్యూ సో మచ్ మామయ్య' అని ట్వీట్ చేశాడు.