దేవినేని అవినాశ్ తో సెటిల్ చేసుకోమంటున్నారు: మైనార్టీ నాయకురాలు రజిమా
- తన తల్లిపై దాడి చేశారన్న రజిమా
- వైసీపీ కోసం పని చేస్తే కళ్లలో కారం కొట్టారని మండిపాటు
- సెటిల్ చేసుకోవడానికి తామేమైనా బ్లేడ్ బ్యాచా? అని ప్రశ్న
దేవినేని అవినాశ్ తో సెటిల్ చేసుకోవాలని పోలీసులు చెప్పారని... ఆయనతో ఏం సెటిల్ చేసుకోవాలని ప్రశ్నించారు. సెటిల్ చేసుకోవడానికి తామేమైనా బ్లేడ్ బ్యాచా? అని ప్రశ్నించారు. తమ ఇంటిపై దాడి చేశారని, తన తల్లిని కొట్టారని, బూటు కాళ్లతో తన్నారని, కళ్లలో కారం కొట్టారని మండిపడ్డారు. వైసీపీ కోసం తాము పనిచేస్తే... ఇప్పుడు తమ కళ్లలోనే కారం కొట్టారని అన్నారు. మహిళలపై దాడి చేయాలని సీఎం జగన్ చెప్పారా? అని దుయ్యబట్టారు.