'బుట్టబొమ్మ' నుంచి ఫస్టు సింగిల్ రిలీజ్!
- బాలనటిగా అనిఖ పాప్యులర్
- టీనేజ్ హీరోయిన్ గా వరుస సినిమాలు
- విడుదలకి రెడీ అవుతున్న 'బుట్టబొమ్మ'
- టాలీవుడ్లో బిజీ అయ్యే అవకాశాలు
గ్రామీణ నేపథ్యంలో రూపొందిన స్వచ్ఛమైన ప్రేమకథ ఇది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేశారు. "పేరులేని ఊరిలోకి కొత్త గాలొచ్చిందా? ఊసుపోక ఊసులెన్నో తీసుకొస్తూ ఉందా? అంటూ ఈ పాట నేపథ్య గీతంగా వస్తోంది. పల్లె వాతావరణానికి .. అక్కడి జీవనానికి ఈ పాట అద్దం పడుతోంది.
స్వీకర్ అగస్తి సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటను మోహన భోగరాజు ఆలపించారు. హుషారైన ఈ పాట బీట్ బాగుంది. మోహన భోగరాజు స్వరం ఈ పాటకి ప్రాణం పోసింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత అనిఖ ఇక్కడ బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.