ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కళ్లు తెరవాలి: స్వరూపానందేంద్ర స్వామి
- అయ్యప్ప స్వామిపై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై స్వరూపానందేంద్ర ఆగ్రహం
- ఈ విషయాన్ని అంత ఈజీగా తీసుకోవద్దని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు సూచన
- హిందూ సమాజాన్ని దూషించే వాళ్లను జైళ్లలో కుక్కాలన్న స్వరూపానందేంద్ర
హిందూ దేవుళ్లపై దూషణలు జరుగుతున్నా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఏ మాత్రం స్పందించలేదని స్వరూపానంద అన్నారు. ఈ దూషణలను అంత ఈజీగా తీసుకోద్దని, ఇప్పటికైనా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కళ్లు తెరవాలని చెప్పారు. కేవలం మైనార్టీలే కాకుండా హిందువులు కూడా ఓటర్లే అనే విషయాన్ని గుర్తించాలని అన్నారు. హిందూ దేవుళ్లను, హిందూ సమాజాన్ని కించపరిచేలా మాట్లాడే వ్యక్తులను కఠినమైన సెక్షన్లతో జైళ్లలో కుక్కాలని చెప్పారు. ఇంకెవరూ ఇలాంటి ద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేయకుండా కఠినంగా శిక్షించాలని అన్నారు.