సమంత ‘శాకుంతలం’ రిలీజ్ డేట్ ఖరారు
- ఫిబ్రవరి 17న విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటన
- గుణశేఖర్ దర్శకత్వం వహించిన పౌరాణిక చిత్రం
- ప్రధాన పాత్ర పోషించిన సమంత
గతేడాది నవంబర్ లోనే విడుదల చేస్తామని ముందుగా ప్రకటించినా తర్వాత వాయిదా వేస్తున్నట్టు తెలిపింది చిత్ర బృందం. కానీ, చాన్నాళ్ల నుంచి విడుదల తేదీ గురించి సమాచారం లేకపోవడంతో అభిమానులు నిరుత్సాహపడ్డారు. అయితే, కొత్త ఏడాది సందర్భంగా ఈ చిత్రం విడుదల తేదీని ఖరారు చేశారు. సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు బరిలో ఉండటంతో ఫిబ్రవరి 17వ తేదీని ఎంచుకున్నట్టు తెలుస్తోంది.