కంటెంట్ మీదున్న నమ్మకంతోనే 'టాప్ గేర్' తీశాం: నిర్మాత శ్రీధర్ రెడ్డి
- ఆదిసాయికుమార్ హీరోగా రూపొందిన 'టాప్ గేర్'
- ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న నిర్మాత శ్రీధర్ రెడ్డి
- ఈ కథ కొత్తగా ఉంటుందని వెల్లడి
- ఆది సాయికుమార్ కి హిట్ ఖాయమంటూ వ్యాఖ్య
*టాప్ గేర్ సినిమా ఎలా ఉండబోతోంది?
'టాప్ గేర్' సినిమా చాలా బాగుంటుంది. ఈ సినిమాతో ఆదికి వచ్చే ఏడాది శుభారంభం కానుంది. ఆది మంచి డాన్సర్ .. మంచి నటుడు. టాప్ గేర్ సినిమాతో వచ్చే ఏడాది ఆయన దశ మారుతుంది.
*టాప్ గేర్ సినిమాలో మీకు ఏ పాయింట్ నచ్చింది?
మనం కథ విన్నప్పుడు అది మనల్ని హాంట్ చేయాలి. శశికాంత్ ఈ కథ చెప్పిన తరువాత నాకు చాలా నచ్చింది. ఈ కథ విన్న తరువాత ఆది అయితే బాగుంటాడని మేం అనుకున్నాం. వెళ్లి కథ చెప్పాం. ఆయన ఓకే అన్నారు.
*'టాప్ గేర్' సినిమా కోసం డైరెక్టర్ చేసిన వర్క్ ఎలా అనిపించింది?
'టాప్ గేర్' సినిమాను డైరెక్టర్ అద్భుతంగా తీశారు. ఇందులో స్క్రీన్ ప్లే హైలెట్ అవుతుంది. నెక్ట్స్ సీన్ ఏంటి? అనే ఆసక్తిని రేకెత్తించేలా సినిమాను తీశారు.
*హర్షవర్దన్ మ్యూజిక్, ఆర్ఆర్ గురించి చెప్పండి?
'టాప్ గేర్' సినిమాకు అసలు హీరో ఆయనే. ఇలాంటి సినిమాలకు హర్షవర్దన్ మ్యూజిక్, ఆర్ఆర్ ప్లస్ అవుతుంది.
*'టాప్ గేర్' సినిమాకు బడ్జెట్ పెరిగిందా?
ముందు అనుకున్న బడ్జెట్ కన్నా కాస్త పెరిగింది. క్వాలిటీ కోసమే ఖర్చు పెట్టాం. సినిమాను చూశాక ఆడియెన్స్ కూడా అదే మాట చెబుతారు. కంటెంట్ మీదున్న నమ్మకంతోనే సినిమాను తీశాం. నాకున్న పరిచయాలతో సినిమాను సేఫ్ ప్రాజెక్ట్‌గా మార్చగలను.
*'టాప్ గేర్' కథ ఏంటి?
క్యాబ్ డ్రైవర్‌లకు కస్టమర్లతో కూడా సమస్యలు వస్తుంటాయి. అలా అనుకోకుండా హీరో ఓ సమస్యలో చిక్కకుంటాడు. దాని నుంచి ఎలా బయటపడతాడు? అనేది కథ. తన భార్యను కాపాడుకునేందుకు హీరో చేసే ప్రయత్నాలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి.
*ప్రస్తుతం నిర్మాతలు ఎదుర్కొంటున్న సవాళ్లు ఏంటి?
ప్రతీది నిర్మాతకు చాలెంజింగ్‌గానే ఉంటుంది. సినిమాను ప్రారంభించడం, పూర్తి చేయడం, రిలీజ్ చేయడం అన్నీ సవాళ్లే. మనకు సినిమాలంటే ఇష్టం, ప్యాషన్ కాబట్టి చేస్తుంటాం. వాటిని ఎదుర్కోగలను అనే ధైర్యం ఉంటేనే ఇందులోకి రావాలి. మా సినిమా అద్భుతంగా వచ్చింది. మా చిత్రం మీద నాకు నమ్మకం ఉంది.
*'టాప్ గేర్' సినిమాను చూశాక సాయి కుమార్ రియాక్షన్ ఏంటి?
ఆదికి 2023 చాలా బాగుండబోతోందని, 'టాప్ గేర్' సినిమాతో అది ప్రారంభం అవుతుందని సాయి కుమార్ గారు చెప్పుకొచ్చారు. టాప్ గేర్ సినిమా పట్ల ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు" అంటూ చెప్పుకొచ్చారు.