మందుబాబులకు పిల్లను ఇవ్వకండి: కేంద్ర మంత్రి కౌశల్ కిశోర్
- మద్యానికి అలవాటు పడి తన కుమారుడు మరణించారన్న కౌశల్ కిశోర్
- ఇప్పుడు అతని భార్య ఏకాకిగా మిగిలిపోయిందని వ్యాఖ్య
- ఇలాంటి పరిస్థితి ఎవరికీ రావద్దని ఆవేదన
కానీ, మళ్లీ తాగడాన్ని ప్రారంభించాడని, చివరకు రెండేళ్ల క్రితం చనిపోయాడని తెలిపారు. అతను చనిపోయేటప్పుడు అతని కుమారుడికి రెండేళ్ల వయసు మాత్రమేనని చెప్పారు. అతని భార్య ఏకాకిగా మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి ఇంకెవరికీ రాకూడదని చెప్పారు. ఇలాంటి పరిస్థితి నుంచి మీ కూతుర్లని, అక్కచెల్లెళ్లను కాపాడుకోవాలని తెలిపారు. మద్యం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఏటా 20 లక్షల మంది మరణిస్తున్నారని చెప్పారు. మద్యానికి అలవాటైన వారి జీవిత కాలం చాలా తక్కువని అన్నారు. పాఠశాలల్లో సైతం దీనిపై అవగాహన కల్పించాలని చెప్పారు.