హమ్మయ్య.. అశ్విన్, అయ్యర్ పోరాటంతో గట్టెక్కిన భారత్
- 3 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ పై ఉత్కంఠ విజయం
- ఎనిమిదో వికెట్ కు 71 పరుగులు జోడించిన అశ్విన్, అయ్యర్
- రెండు టెస్టుల సిరీస్ ను 2–0తో గెలిచిన టీమిండియా
145 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కేఎల్ రాహుల్(2), శుభమన్ గిల్(7), చతేశ్వర్ పుజారా (6), విరాట్ కోహ్లీ (1), రిషభ్ పంత్(9) నిరాశ పరచడంతో ఓ దశలో 74/7తో జట్టు ఓటమి అంచుల్లో నిలిచింది. ఈ దశలో అశ్విన్, అయ్యర్ ఎనిమిదో వికెట్ కు అజేయంగా 71 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. అక్షర్ పటేల్ (34) కూడా రాణించాడు. అశ్విన్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. చతేశ్వర్ పుజారా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచాడు.