మరోసారి ప్రయోగం చేస్తున్న రామ్ చరణ్!
- శంకర్ చిత్రంలో రెండు పాత్రల్లో కనిపించబోతున్న చరణ్!
- ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే తండ్రి పాత్రకు నత్తి ఉండేలా డిజైన్ చేసిన శంకర్
- గతంలో లవకుశలో ఎన్టీఆర్, లైగర్ లో విజయ్ చేసినవి నత్తి పాత్రలే
ఇందులో చరణ్ రెండు పాత్రల్లో కనిపిస్తాడని టాలీవుడ్ లో ప్రచారం జరగుతోంది. తండ్రీకొడుకుల పాత్రలను చరణ్ పోషిస్తున్నాడని తెలుస్తోంది. ఇందులో ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే తండ్రి పాత్రకు నత్తి వుంటుందట. ఈ పాత్ర కోసం శంకర్ ప్రత్యేకంగా దృష్టి సారించారని సమాచారం. అయితే, ఈ తరహా పాత్ర టాలీవుడ్ కు కొత్తేం కాదు. ఈ మధ్యనే విజయ్ దేవరకొండ ‘లైగర్’ లో, అంతకంటే ముందు ‘లవకుశ’లో ఎన్టీఆర్ చేశారు. లవకుశలో ఎన్టీఆర్ మూడు పాత్రలు పోషించారు. అందులో ఓ పాత్రకు నత్తి ఉంది. ఓవరాల్ గా ఆ సినిమాతో ఎన్టీఆర్ హిట్ కొట్టగా, లైగర్ తో విజయ్ బోల్తా కొట్టాడు.