అందాల అనుపమకి ఈ ఏడాది కలిసొచ్చినట్టే!
- 'కార్తికేయ 2'తో అనుపమకు బ్లాక్ బస్టర్ హిట్
- ఈ నెల 23న వస్తున్న '18 పేజెస్'
- హిట్ ఖాయమంటూ వినిపిస్తున్న టాక్
నిజానికి 'రాక్షసుడు' హిట్ తన ఖాతాలోకి రాకపోవడం .. ఆ తరువాత హిట్ అనేది పలకరించకపోవడం అనుపమ అభిమానులను నిరాశపరిచింది. 'రౌడీ బాయ్స్' ఫ్లాప్ తరువాత ఆమె కెరియర్ మరింత ప్రమాదంలో పడింది. ఈ నేపథ్యంలోనే ఆమెను 'కార్తికేయ 2' ఆదుకుంది. పాన్ ఇండియా స్థాయిలో ఆ సినిమా దూసుకుపోవడంతో అనుపమ గురించి అందరికీ తెలిసింది.
మొత్తానికి ఈ ఏడాదిలో అనుపమ ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందని అనుకుంటే, ఈ నెల 23వ తేదీన '18 పేజెస్' కూడా థియేటర్ లకు వస్తోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ .. సుకుమార్ రాసిన కథ .. ఈ ప్రాజెక్టుపై అంచనాలు పెంచుతున్నాయి. ఈ సినిమా కూడా హిట్ అయితే అనుపమ మరికొంతకాలం పాటు ఇక్కడ తన జోరును చూపించే అవకాశం కలుగుతుందని చెప్పచ్చు.