ఈ ఏడాదికి ఇంతే .. మురిపించలేకపోయిన ముగ్గురు భామలు!
- టాప్ త్రీ హీరోయిన్స్ గా పూజ .. రష్మిక .. కీర్తి
- ముగ్గురికీ కలిసిరాని 2022
- మూడు ఫ్లాపులతో ఉన్న పూజ హెగ్డే
- అసంతృప్తినే మిగిల్చిన రష్మిక సినిమాలు
- ఆశించినస్థాయి హిట్ ను అందుకోలేకపోయిన కీర్తి సురేశ్
పూజ హెగ్డే నుంచి 'రాధే శ్యామ్' .. ' బీస్ట్' .. 'ఆచార్య' సినిమాలు రాగా, ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కేటగిరీలోకి అడుగుపెట్టలేకపోయింది. చాలా తక్కువ గ్యాపులో థియేటర్లకు వచ్చిన ఈ మూడు సినిమాలు, ఆమె గ్రాఫ్ పై ఎఫెక్ట్ పడేలా చేశాయి. ఇక రష్మిక విషయానికొస్తే ఆమె చేసిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' పరాజయం పాలైంది. 'సీతా రామం' హిట్ అయినప్పటికీ అందులో ఆమె కనిపించింది హీరోయిన్ గా కాకపోవడంతో ఆ క్రెడిట్ మృణాళ్ ఠాకూర్ ఖాతాలోకి వెళ్లిపోయింది.
ఇక కీర్తి సురేశ్ నుంచి వచ్చిన 'గుడ్ లక్ సఖి' ఆమెకి చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇక నాయిక ప్రధానమైన కథలను ఇప్పట్లో చేయకూడదనే నిర్ణయానికి ఆమెను తెచ్చింది. ఆ తరువాత సినిమాగా 'సర్కారువారి పాట' చేసింది. మహేశ్ బాబు క్రేజ్ మాత్రమే ఈ సినిమాకి వసూళ్లను తెచ్చే బాధ్యతను భుజాలపై వేసుకుంది. కథాకథనాల పరంగా మాత్రం అభిమానులను సంతృప్తి పరచలేకపోయింది. ఇలా చూసుకుంటే ఈ ఏడాదిలో టాప్ 3లో ఉన్న ముగ్గురు హీరోయిన్స్ కి కూడా సరైన హిట్ పడకుండానే పోయిందని చెప్పాలి.