రోహిత్ రెడ్డి సవాల్ ను నేను పట్టించుకోను: బండి సంజయ్
- రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు
- బెంగళూరు డ్రగ్స్ కేసు రీఓపెన్ చేయాలన్న బండి సంజయ్
- రోహిత్ రెడ్డికి కర్ణాటక ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందని వెల్లడి
- ఆధారాలు చూపించాలని సవాల్ విసిరిన రోహిత్ రెడ్డి
దీనిపై బండి సంజయ్ స్పందించారు. రోహిత్ రెడ్డి సవాల్ ను తాను పట్టించుకోనని స్పష్టం చేశారు. ఎవరు పడితే వారు సవాల్ విసిరితే తాను స్పందించనని అన్నారు.
ఈడీ రోహిత్ రెడ్డికి నోటీసులు జారీ చేయడం తెలిసిందే. అంతకుముందు, బండి సంజయ్ స్పందిస్తూ బెంగళూరు డ్రగ్స్ కేసును రీఓపెన్ చేస్తే రోహిత్ రెడ్డి పాత్ర బయటపడుతుందని అన్నారు. ఈ కేసులో రోహిత్ రెడ్డికి కర్ణాటక ప్రభుత్వం నుంచి నోటీసు కూడా వచ్చిందని తెలిపారు. దీనిపైనే రోహిత్ రెడ్డి... బండి సంజయ్ కు సవాల్ విసిరారు.