లక్కీ ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ భామ అషు రెడ్డి
- అరవింద్ కృష్ణ హీరోగా 'ఏ మాస్టర్ పీస్' సినిమా
- ఈ చిత్రంలో హీరోయిన్ గా అషు ఎంపిక
- 2018లో చివరి సారిగా వెండి తెరపై కనిపించిన అషు
ఈ చిత్రాన్ని కండ్రగుల శ్రీకాంత్ నిర్మించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టైటిల్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. 2018లో అషు రెడ్డి చివరిసారి వెండి తెరపై కనిపించింది. నితిన్, మేఘా ఆకాశ్ కాంబినేషన్లో వచ్చిన 'ఛల్ మోహనరంగ' సినిమాలో ఆమె ఓ పాత్రలో కనిపించింది. ఇప్పుడు హీరోయిన్ పాత్రకు ఎంపికయిందనే వార్తతో ఆమె అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.