వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటారా? అనే ప్రశ్నకు విశాల్ ఆసక్తికర సమాధానం!
- ప్రభాస్ పెళ్లి అయిన వెంటనే తాను పెళ్లి చేసుకుంటానంటూ విశాల్ చమత్కారం
- వివాహం ఎన్నో బాధ్యతలతో కూడుకున్నదని వ్యాఖ్య
- పెళ్లి చేసుకోవాలనే ఆలోచన అయితే ఉందని వెల్లడి
వివాహం ఎన్నో బాధ్యతలతో కూడుకున్నదని... పెళ్లి అంటే జోక్ కాదని అన్నారు. వృత్తి పట్ల ఎంత అంకిత భావంతో ఉన్నామో వ్యక్తిగత జీవితంలో కూడా అలాగే ఉండాలని చెప్పారు. నటుడిగా తనకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయని తెలిపాడు. పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉన్నప్పటికీ ప్రస్తుతం తాను సినిమాలపైనే దృష్టిని కేంద్రీకరించానని చెప్పాడు.