జనవరి 12న పవన్ కల్యాణ్ 'యువ శక్తి' సభ
- కొత్త కార్యాచరణకు రూపకల్పన చేసిన జనసేన
- వచ్చే ఏడాది పలు జిల్లాల్లో యువశక్తి సభలు
- యువత ఎదుర్కొంటున్న సమస్యలపై గళమెత్తే ప్రయత్నం
- యువతకు భరోసా ఇస్తామన్న నాదెండ్ల
యువత ఎదుర్కొంటున్న సమస్యలపై గళమెత్తడం కోసమే 'యువ శక్తి' సభలు నిర్వహిస్తున్నట్టు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ సభల ద్వారా రాష్ట్రంలోని యువతకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తామని తెలిపారు. పలు జిల్లాల్లో 'యువ శక్తి' సభలు జరుపుతామని వివరించారు.