ప్రతి ఇంట్లో ఒక కూతురు ఉండాలి: శ్రీసత్య తండ్రి
- బిగ్ బాస్ హౌస్ లో శ్రీసత్య స్థానం ప్రత్యేకం
- ఆమె ఆటతీరును గురించి ప్రస్తావించిన తండ్రి
- శ్రీ సత్య తల్లి పరిస్థితిని గురించి వెల్లడి
- తన కూతురు విన్నర్ గా నిలవాలనే ఆకాంక్ష
మూడెళ్ల క్రితం తాను ఒక వ్యక్తిని లవ్ చేస్తున్నట్టుగా శ్రీసత్య చెప్పింది. ఆ అబ్బాయిని పిలిపించి మాట్లాడాను. పెళ్లికి రెండు కుటుంబాల వాళ్లం అంగీకరించాము. ఆ అబ్బాయితో శ్రీసత్య ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. ఆ తరువాత కొన్ని కారణాల వలన ఆ సంబంధాన్ని కేన్సిల్ చేసుకున్నాము. ఆ బాధతో శ్రీ సత్య ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేసింది" అన్నారు.
శ్రీసత్య అలా చేయడం చూసిన ఆమె తల్లికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అందువలన ఆమె కాళ్లు పనిచేయడం మానేశాయి. ఆమె ట్రీట్మెంట్ కోసం ఆస్తులు అమ్మేయవలసి వచ్చింది. అప్పటి నుంచి తల్లి ట్రీట్మెంట్ కోసం శ్రీ సత్య కష్టపడుతూనే ఉంది. ప్రతి ఇంట్లోను ఒక కూతురు ఉండాలి. కన్నవాళ్ల కోసం రెండు కన్నీటి బొట్లు రాల్చేది ఆడపిల్లనే" అంటూ చెప్పుకొచ్చాడు.