అన్ స్టాపబుల్-2 సెట్ కు ఇంటి భోజనం పట్టుకొచ్చిన ప్రభాస్
- బాలకృష్ణ అన్ స్టాపబుల్-2 లేటెస్ట్ ఎపిసోడ్ లో ప్రభాస్
- ఎపిసోడ్ షూటింగ్ కు హాజరైన ప్రభాస్
- బాలయ్యకు ఇష్టమైన వంటకాలతో విందు భోజనం
ఈ చిత్రీకరణకు వస్తూ, తమ ఇంటి నుంచి నోరూరించే వంటకాలను కూడా తీసుకువచ్చారు. వేటమాంసం కూర, పీతల ఇగురు, చేపల పులుసు, కోడికూర, సాంబారు, పప్పు, ఆవకాయ తదితర వంటకాలతో హోస్ట్ నందమూరి బాలకృష్ణకు పసందైన విందు ఏర్పాటు చేశారట. బాలయ్యకు ఇష్టమైన వంటకాలు ఏంటో ముందే తెలుసుకున్న ప్రభాస్ ఆ మేరకు తన ఇంట్లో వండించినట్టు తెలిసింది.