'జైలర్' నుంచి రజనీ స్పెషల్ పోస్టర్!
- 'జైలర్'గా రజనీకాంత్
- జైలు చుట్టూ తిరిగే కథ ఇది
- కీలకమైన పాత్రను పోషించిన రమ్యకృష్ణ
- ఏప్రిల్ 14వ తేదీన సినిమా రిలీజ్
ఈ రోజున రజనీ బర్త్ డే కావడంతో, ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి రజనీ స్పెషల్ పోస్టర్ ను వదిలారు. ఈ సినిమాలో ఆయన పాత్ర అయిన 'ముత్తు వేల్ పాండియన్' ను ఈ పోస్టర్ ద్వారా పరిచయం చేశారు. రజనీ మార్క్ స్టయిల్ ఈ పోస్టర్ లో కనిపిస్తూనే ఉంది.
ఇది ఒక జైలు చుట్టూ తిరిగే కథ అనీ .. 'జైలర్' చుట్టూ తిరిగే కథ అని తెలుస్తోంది. చాలాకాలం తరువాత రజనీ .. రమ్యకృష్ణ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.