బాలయ్య అన్స్టాపబుల్ షోలో ప్రభాస్, గోపీచంద్ ఎపిసోడ్ చిత్రీకరణ పూర్తి.. ఫొటోలు ఇవిగో!
- ఒకే స్టేజిపై, ఒకే ఫ్రేములో ప్రభాస్, బాలయ్య
- తన స్నేహితుడు గోపీచంద్ తో కలిసి షూటింగ్ కు వచ్చిన రెబల్ స్టార్
- ఎన్నడూ చూడని కొత్త యాంగిల్ చేస్తారంటున్న అన్ స్టాపబుల్ టీమ్
ఈ షోకు తన స్నేహితుడు, తోటి హీరో గోపీచంద్ తో కలిసి వచ్చారు ప్రభాస్. బాలయ్యతో ప్రభాస్ తొలిసారి తెరపై కనిపించబోతున్నారు. ఈ ఎపిసోడ్ చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. ఈ విషయాన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా ప్రకటించింది. బాలయ్య, ప్రభాస్, గోపీచంద్ చిత్రీకరణలో పాల్గొన్న ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేసింది. ప్రభాస్, బాలయ్య ఒకే స్టేజ్, ఫ్రేమ్ లోకి వచ్చిన విషయాన్ని తాము ఇంకా నమ్మలేకపోతున్నామని ట్వీట్ చేసింది. ‘మీరు ఎన్నడూ చూడని ఒక కొత్త యాంగిల్ మీకు చూపించే మాసివ్ ఎపిసోడ్ ఇది. త్వరలో మీ ముందుకు వస్తుంది’ అని పేర్కొంది.