నేటి మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల
- జనవరి నెల కోటాపై టీటీడీ అధికారిక ప్రకటన
- ఈ నెల 16, 31వ తేదీలలో రూ.300 దర్శనం టికెట్ల విడుదల రేపు
- ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు సుప్రభాత సేవల రద్దు
ఈ నెల 16వ తేదీ సాయంత్రం నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుండడంతో మరుసటి రోజు.. అంటే 17వ తేదీ నుంచి జనవరి 14 వ తేదీ వరకు శ్రీవారి సుప్రభాత సేవలను టీటీడీ రద్దు చేసింది. మరోవైపు, ఆర్జిత సేవా టికెట్లతో పాటు కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లను కూడా విడుదల చేయనున్నట్లు అధికారులు చెప్పారు. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ, పాద పద్మారాధన సేవా టికెట్లు కూడా అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.