బాలకృష్ణ అన్ స్టాపబుల్-2 టాక్ షోకి ప్రభాస్
- బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్-2 టాక్ షో
- తాజా ఎపిసోడ్ కు వస్తున్న ప్రభాస్
- లేటెస్ట్ ఎపిసోడ్ పై సర్వత్రా ఆసక్తి
అన్ స్టాపబుల్ -2 లేటెస్ట్ ఎపిసోడ్ భారీస్థాయిలో అంచనాలను పెంచుతోంది. ఎందుకంటే ఈ ఎపిసోడ్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాల్గొంటున్నాడు. దీనికి సంబంధించిన టీజర్ ను ఆహా ఓటీటీ యూట్యూబ్ లో పంచుకుంది. మొట్టమొదటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అన్ స్టాపబుల్-2 తాజా ఎపిసోడ్ లో అలరించేందుకు వస్తున్నాడంటూ పేర్కొంది.
ఈ వీడియో విడుదలైన కొన్ని గంటల్లోనే 2 లక్షల వ్యూస్ దాటిపోయింది. ప్రభాస్ అభిమానుల్లో ఈ టీజర్ వీడియో విపరీతమైన ఆసక్తి రేకెత్తిస్తోంది.