వైసీపీ నేత దేవినేని అవినాశ్ నివాసంలో ఐటీ దాడులు
- తనిఖీలు నిర్వహిస్తున్న హైదరాబాద్ నుంచి వచ్చిన ఐటీ అధికారులు
- ఉదయం 6 గంటల నుంచి కొనసాగుతున్న సోదాలు
- వంశీరామ్ రియలెస్టేట్ కంపెనీలో పెట్టుబడులపై ఆరా?
దాడుల వెనుక ఉన్న కారణం ఏమిటనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేనప్పటికీ... హైదరాబాద్ లో ఉన్న వంశీరామ్ రియలెస్టేట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారా? అనే కోణంలో దాడులు జరుగుతుండొచ్చని భావిస్తున్నారు. సోదాలు పూర్తయిన తర్వాతే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఈ ఐటీ దాడులు విజయవాడలో చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణుల్లో కలకలం రేపాయి.