రాయలసీమ గర్జన సభలో సొమ్మసిల్లి పడిపోయిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి
- సభలో మాట్లాడిన తర్వాత సంఘటన
- కళ్లు తిరిగి పడిపోవడంతో అక్కడున్నవాళ్లంతా షాక్
- కాసేపటికే తేరుకోవడంతో ఊపిరిపీల్చుకున్న ఇతర నాయకులు
సీమ ప్రాంతానికి చెందిన విద్యార్థులు, యువత చదువు, ఉద్యోగం కోసం.. హైదరాబాద్, బెంగళూరు, మద్రాస్ వెళ్లాలా? ఇక్కడి వారికి ఇక్కడే అవకాశాలు కలిపించవద్దా? అని ఆయన ప్రశ్నించారు. రాయలసీమలో ఒక రాజధాని ఏర్పాటు చేస్తే చంద్రబాబుకి వచ్చిన నష్టం ఏంటని ప్రశ్నించారు. రాయలసీమ నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులు అయినా..సీమ ఇప్పటికీ వెనుకబడే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘రాజధానిని అడిగే హక్కు రాయలసీమ వాసులకు ఉంది. శ్రీశైలానికి భూములు ఇచ్చి రైతులు ఎంతో త్యాగం చేశారు. రాయలసీమకు చంద్రబాబు ద్రోహం చేశారు. అన్ని ప్రాంతాలకు సమానంగా రాయలసీమను అభివృద్ధి చేయాలి’ అని సిద్ధార్థ రెడ్డి పేర్కొన్నారు.