అసలు ఒప్పుకోని తెలుగు సినిమా నుంచి తనను ఎలా తప్పిస్తారంటున్న బాలీవుడ్ హీరోయిన్
- బాలయ్య–అనిల్ రావిపూడి సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాను తీసుకున్నట్టు ప్రచారం
- ఎక్కువ డిమాండ్ చేయడంతో వద్దనుకున్నారంటూ మరో వార్త
- రెండింటినీ ఖండించిన సోనాక్షి సిన్హా
నందమూరి బాలకృష్ణ, యువ దర్శకుడు, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోయే సినిమాలో సోనాక్షిని హీరోయిన్ గా ఖాయం చేశారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ, ఈ ప్రాజెక్టు నుంచి ఆమెను తప్పించారంటూ మళ్లీ కథనాలు వచ్చాయి. ఈ సినిమా కోసం భారీ మొత్తం డిమాండ్ చేయడంతోనే సోనాక్షిని కాదనుకుంటున్నారని పుకార్లు మొదలయ్యాయి. వీటిని అనిల్ రావిపూడి కానీ, చిత్ర బృందం కానీ ధ్రువీకరించలేదు.
ఈ క్రమంలో ఈ వార్తలపై సోనాక్షి స్పందించింది. ‘టాలీవుడ్ సినిమాలో నేను నటించబోతున్నట్టు కొన్ని రోజుల కిందట వార్తలు వచ్చాయి. అవి నిజం కాదు, ఇప్పుడు అదే సినిమా నుంచి తనను తప్పించారంటూ వార్తలు వస్తున్నాయి. అసలు ఒప్పుకోని సినిమా నుంచి హీరోయిన్‌ని ఎవరైనా తీసేస్తారా?’ అని ప్రశ్నించింది . తన టాలీవుడ్ ఎంట్రీ విషయంలో వస్తున్న వార్తలన్నీ పుకార్లే అని కొట్టిపారేసింది.