ప్రభాస్, కృతి సనన్ డేటింగ్..? హింట్ ఇచ్చిన వరుణ్ ధావన్!
- జలక్ ధికలాజ కార్యక్రమంలో పాల్గొన్న వరుణ్ ధావన్, కృతి సనన్
- కృతి మరొకరి హృదయంలో ఉందన్న వరుణ్
- అతడు ముంబైలో ఉండడు.. దీపికతో షూటింగ్ లో ఉన్నాడని వెల్లడి
కార్యక్రమం న్యాయ నిర్ణేతల్లో కరణ్ జొహార్ ఒకరిగా ఉన్నాడు. లిస్ట్ లో కృతి సనన్ పేరు ఎందుకు మిస్ అయ్యిందని వరుణ్ ను అడిగాడు. ‘‘కృతి పేరు ఇందులో లేదు. ఎందుకంటే కృతి పేరు...’’ అని వరుణ్ చెప్పబోతుండగా పక్కనే ఉన్న కృతి సనన్ అడ్డుకుంది. అయినప్పటికీ వరుణ్ చెప్పడం కొనసాగిస్తూ.. ఒకరి హృదయంలో ఉందన్నాడు. పేరు చెప్పాలని కరణ్ కోరాడు.
‘‘ఆ వ్యక్తి ముంబైలో ఉండడు. దీపికతో షూటింగ్ లో ఉన్నాడు’’ అని వరుణ్ వెల్లడించాడు. ప్రభాస్ ప్రస్తుతం దీపిక పదుకొణెతో కలసి ప్రాజెక్ట్ కే చిత్రంలో పాల్గొంటుండడం తెలిసిందే. వరుణ్ అలా చెప్పినప్పుడు కృతి ఏమీ మాట్లాడకుండా చిరునవ్వు చిందిస్తూ నిజమేనన్న భావనను వ్యక్తం చేయడం వారి మధ్య రిలేషన్ షిప్ కు నిదర్శనమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.